Pawan Kalyan: 2019లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుంది.. నాకు అండగా నిలబడండి.. మడమ తిప్పను: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
తనకు డబ్బు అవసరం లేదని, మీరిచ్చే ప్రేమ ముందు లక్షల కోట్లు కూడా పనికిరావని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరీంనగర్ లోని శుభంగార్డెన్స్ లో జనసేన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణలు వేరైనా అందరం ఒకటే అని ఆయన అన్నారు. ప్రాంతీయ విభేదాలు సమాజానికి మంచిది కాదని చెప్పారు.

2019 ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని... ఆ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుందని తెలిపారు. కుల, మత, ప్రాంతీయతత్వాలు లేని పార్టీ జనసేన అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పే వ్యక్తిని కాదని చెప్పారు. 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి జనసైనికులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పారు. తాను తెలంగాణ వ్యతిరేకిని కాదు అని స్పష్టం చేశారు. 
Go Back to Shorts
Pawan Kalyan
janasena

More Telugu News