చెర్రీ, వరుణ్, సాయి ధరమ్ చెప్పారుగానీ, పవన్ కల్యాణ్ కు బన్నీ మాత్రం 'ఆల్ ది బెస్ట్' చెప్పలేదట!
- ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్
- మెగా హీరోల నుంచి పెద్ద ఎత్తున మద్దతు
- ఇంకా అభినందనలు చెప్పని అల్లు అర్జున్
- కారణమేంటని మెగాభిమానుల మధ్య చర్చ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కు అభినందనలు చెప్పలేదట. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో మిగతా వారితో పోలిస్తే, యాక్టివ్ గా ఉండే బన్నీ, పవన్ కు విషెస్ చెప్పకపోవటం వెనుక కారణాలేంటన్న చర్చ అభిమానుల్లో జరుగుతోంది. మరోవైపు బన్నీ బ్రదర్ అల్లు శిరీష్ కూడా పవన్ రాజకీయ ప్రవేశంపై స్పందించలేదు. గతంలో జరిగిన సినిమా ఫంక్షన్స్ లో 'చెప్పను బ్రదర్' అంటూ వేదికపై మాట్లాడి, పవన్ అభిమానుల విమర్శలకు గురైన అల్లు అర్జున్, ఇప్పుడు స్పందించకపోవడం వెనుక కారణమేంటో?