Pawan Kalyan: రక్తమోడుతున్న అభిమానిని స్టేజ్ పైకి పిలిచి.. పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం!

  • తోపులాటలో అద్దం పగిలి పవన్ అభిమానికి గాయాలు
  • అత్యుత్సాహం చూపవద్దని హితవు పలికిన పవన్
  • ఇటువంటివి జరిగితే తట్టుకోలేనన్న జనసేనాని
తాను పిలిస్తే, తన కోసం వచ్చి తీవ్రంగా గాయపడిన ఓ అభిమానిని చూపిస్తూ, పవన్ కల్యాణ్ భావోద్వేగంతో మాట్లాడారు. నేడు రెండో రోజు తన 'చలోరే చల్' యాత్రలో భాగంగా మూడు జిల్లాల అభిమానులను కలిసిన ఆయన, అభిమానులు అత్యుత్సాహాన్ని ఎక్కువగా చూపవద్దని కోరారు.

అద్దాలు పగిలిన కారణంగా గాయాలపాలై, చొక్కా అంతా రక్తం నిండినా, పవన్ ను దగ్గరగా చూసేందుకు ఆత్రుత పడుతున్న అభిమానిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడి, అతన్ని ఆసుపత్రికి పంపించాలని సూచించారు. తానెంతో ఇష్టపడే అభిమానులకు ఇటువంటి ఘటనలు ఎదురైతే తాను తట్టుకోలేనని అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని తెలిపారు. అభిమానులు 'సీఎం సీఎం' అని నినాదాలు చేస్తుంటే వారిని వారించారు.
Pawan Kalyan
Jana Sena
Chalore Chal
Telangana

More Telugu News