Jagan: జగన్ మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి: ఎమ్మెల్యే నక్కా

  • దళితులను వైయస్ కుటుంబం దోచుకుంది
  • దళితులపై జగన్ ప్రేమ హాస్యాస్పదం
  • టీడీపీ పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారు
దళితుల పట్ల వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందని టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. ఇడుపులపాయలో దళితుల భూములను దోచుకున్నవారు... వారిపై ప్రేమను కురిపించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. దళితులను వైయస్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. దళితుల సంక్షేమం కేవలం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దళితుల సంక్షేమంపై చర్చకు జగన్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.
Jagan
YSRCP
Chandrababu
nakka anand babu

More Telugu News