nagarjuna: అఖిల్ విషయంలో కలగజేసుకోకూడదని నాగార్జున నిర్ణయం

  • 'హలో' మూవీ కోసం అన్నీ తానై వ్యవహరించిన నాగ్
  • ప్రేక్షకాదరణ పొందకపోవడంతో నిరుత్సాహం
  • తదుపరి చిత్రంలో కలగజేసుకోకూడదని నిర్ణయం
అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఆ తర్వాత వచ్చిన 'హలో' మూవీపై భారీ అంచనాలున్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. 'హలో' మూవీలో అఖిల్ ను ప్రమోట్ చేయడానికి నాగార్జున పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. సినిమాకు చెందిన ప్రతిదీ ఆయన డైరెక్షన్ లోనే జరిగింది. ప్రతి అంశంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఫలితం ఆశాజనకంగా రాకపోవడంతో నాగ్ డిజప్పాయింట్ అయ్యారు. చివరకు ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారట. అఖిల్ తదుపరి చిత్రంలో ఇన్వాల్వ్ కాకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. 
nagarjuna
akhil
tollywood

More Telugu News