Brahmanandam: ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదల వాయిదా!

  • ఈ నెల 26న విడుదల కావాల్సిన సినిమా వాయిదా
  • టెక్నికల్ కారణాల రీత్యా వాయిదాపడ్డట్టు సమాచారం
  • విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్న చిత్ర బృందం
జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం విడుదల వాయిదా పడినట్టు సమాచారం. ఈ నెల 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం టెక్నికల్ కారణాల రీత్యా వాయిదాపడ్డట్టు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం త్వరలోనే ప్రకటిస్తుందని సమాచారం. కాగా, మంచు విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘ఆచారి అమెరికా యాత్ర’ ట్రైలర్ ఆకట్టుకుంది. 
Brahmanandam
cinema

More Telugu News