Australia: సంచలనం... స్టీవ్ స్మిత్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు!

  • బాల్ పై లిప్ బామ్ ను పూసిన స్టీవ్ స్మిత్
  • వీడియోకు చిక్కిన దృశ్యాలు
  • తానేమీ తప్పు చేయలేదన్న స్మిత్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అనూహ్యంగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. సిడ్నీలో నిన్న ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో తన పెదవులకు ఉన్న లిప్ బామ్ ను తీసి బంతికి పూస్తున్న స్మిత్ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే దీనిపై కామెంట్లు వినిపించగా, మ్యాచ్ అనంతరం స్మిత్ బాల్ ను ట్యాంపర్ చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనిపై స్మిత్ వివరణ ఇస్తూ, తానేమీ బాల్ ను ట్యాంపర్ చేయలేదని, తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. తన పెదవులపై అప్పుడు లిప్ బామ్ లేదని తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ ల సిరీస్ ను 0-3తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్ లో నిదానంగా బౌలింగ్ వేయించినందుకు స్మిత్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతను విధిస్తున్నట్టు అంపైర్లు తెలిపారు.
Australia
Steve Smith
Cricket
Ball Tamparing

More Telugu News