Jagan: జగనన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?: మిథున్ రెడ్డి
- రాష్ట్ర సమస్యలనే తన సమస్యలుగా భావిస్తున్నారు
- జగన్ ముఖ్యమంత్రి కావాలి
- ఆకేపాటి యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది
రాష్ట్ర సమస్యలు, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా భావిస్తున్న జగనన్న రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలమని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. జగన్ విజయం కోసం వైకాపా నేత ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు మహాపాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర రైల్వేకోడూరుకు చేరుకున్న సందర్భంగా మిథున్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కోసం ఆకేపాటి చేపట్టిన యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ వెంకన్నను ఆకేపాటి కోరుకోవాలని చెప్పారు.
ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ, శ్రీవారి కరుణా కటాక్షాలతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగుస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ, శ్రీవారి కరుణా కటాక్షాలతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగుస్తుందని తెలిపారు.