Pawan Kalyan: యాత్రకు బయలుదేరే ముందు... పవన్ కల్యాణ్ తాజా చిత్రాలు!

  • 'చలోరే చల్' యాత్రకు పవన్ కల్యాణ్
  • 'వీర మహిళ' విభాగం ఏర్పాటు
  • జనసేన సోషల్ మీడియా విభాగం ప్రారంభం
ఈ ఉదయం 'చలోరె చల్' పేరిట యాత్రను చేపట్టి, కొండగట్టుకు బయలుదేరడానికి ముందు పవన్ కల్యాణ్, 'జనసేన' సోషల్ మీడియాకు సంబంధించి వీరమహిళపేరుతో ఏర్పాటయిన విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 
ఆపై ఆయన మాట్లాడుతూ "వీరమహిళబృందానికి నా శుభాభినందనలు. జనసేన సోషల్ మీడియా బృందంలో క్రియాశీలక సభ్యులుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. జనసేన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకు వెళుతూ, ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకు వచ్చే విధంగా మీరు కృషి చేస్తారన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ప్రజా శ్రేయస్సుకు మనం అవిరళ కృషి జరుపుదాం. దేశాభివృద్ధిలో మన వంతు పాత్ర పోషిద్దాం" అన్నారు.
పవన్ కల్యాణ్ కు హారతి ఇస్తున్న శ్రీమతి అన్నా పవన్
తన శ్రీమతికి మిఠాయి తినిపిస్తున్న పవన్ కల్యాణ్
'వీర మహిళ' ఏర్పాటు అనంతరం ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan
Janasena
Veeramahila
Social Media

More Telugu News