anchor pradeep: యాంకర్ ప్రదీప్ తండ్రికి కారు అప్పగింత!

  • డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన ప్రదీప్
  • కారు సీజ్
  • కోర్టు తీర్పు తర్వాత కారు అప్పగింత
డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు చెందిన బీఎండబ్ల్యూ కారును ఆయన తండ్రి పాండురంగారావుకు పోలీసులు అప్పగించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన కారును పోలీసులు సీజ్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరైన ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్సును మూడేళ్లపాటు రద్దు చేశారు న్యాయమూర్తి. దీనికి తోడు రూ. 2100 చలానా విధించారు.
anchor pradeep

More Telugu News