TRS: మోత్కుపల్లిపై చర్యలు తీసుకునే యోచనలో టీడీపీ అధిష్ఠానం: టీటీడీపీ అధ్యక్షుడు రమణ

  • మోత్కుపల్లి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  • ప్రగతి భవన్ పైరవీ భవన్ గా మారింది
  • ప్రజాధనాన్ని దోచుకుంటున్న టీఆర్ఎస్ 
టీఆర్ఎస్ లో టీటీడీపీని విలీనం చేయాలంటూ మోత్కుపల్లి నరసింహులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ, మోత్కుపల్లిపై చర్యలు తీసుకునే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉందని అన్నారు. వికారాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోత్కుపల్లి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.

మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను కార్యకర్తలెవ్వరూ ఒప్పుకోరని అన్నారు. ప్రగతి భవన్ పైరవీ భవన్ గా మారిందని, ప్రగతి భవన్ ను ప్రజా ఆసుపత్రిగా మార్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రజాధనాన్ని దోచుకోవడంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండేదని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పోటీపడుతోందని ఆరోపించారు.
TRS
Telugudesam

More Telugu News