Pawan Kalyan: చదువులో ఫెయిలవ్వకపోతే ప్రొఫెసర్ అయ్యేవాడిని: పవన్ కల్యాణ్

  • ‘జనసేన’ అధినేతను కలిసిన పోలాండ్ విద్యార్థులు
  • ‘పోలాండ్’తో భారత్ కు మంచి అనుబంధం ఉంది
  • విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన పవన్ కల్యాణ్
తాను చదువులో ఫెయిలయ్యాయని, ఒకవేళ బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్ ని అయ్యేవాడినని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ సహా అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులతో పవన్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పవన్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

పోలాండ్ దేశంతో భారత్ కు మంచి అనుబంధం ఉందని,  పోలాండ్ సినిమాలను దక్షిణ భారతదేశంలో చిత్రీకరించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే పలు పోలాండ్ చిత్రాలను దక్షిణ భారతదేశంలో చిత్రీకరించిన విషయాన్ని వారితో ప్రస్తావించారు. ఇందుకు, ఆడమ్ బురాకోవస్కీ స్పందిస్తూ, తమ దేశంలో కూడా ఇక్కడి సినిమాల షూటింగ్ లు జరుపుకోవాలని పవన్ ని కోరారు. ఈ సందర్భంగా రాజకీయాలపై పవన్ అభిప్రాయాన్ని ఆడమ్ బురాకోవస్కీ తెలుసుకున్నారు.
Pawan Kalyan
Jana Sena

More Telugu News