Chandrababu: దావోస్ బయల్దేరుతున్న చంద్రబాబు.. కుదుర్చుకోనున్న ఒప్పందాలు ఇవే!

  • రేపటి నుంచి దావోస్ లో చంద్రబాబు పర్యటన
  • పలు ఒప్పందాలను కుదుర్చుకునే పనిలో సీఎం
  • మోదీతో గంటన్నర సేపు గడపనున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి నుంచి 25వ తేదీ వరకు దావోస్ లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే ఏపీ పారిశ్రామిక ప్రగతి రథం దావోస్ లో చక్కర్లు కొడుతోంది. దావోస్ సదస్సులో కీలకమైన ఉపన్యాసకర్తల్లో చంద్రబాబు కూడా ఉన్నారు. ఇదే సదస్సుకు ప్రధాని మోదీ కూడా హాజరవుతున్నారు. వీరిద్దరూ కలసి గంటన్నరపాటు కలసి గడపనున్నారు. ఈ సదస్సు సందర్భంగా దావోస్ కు వచ్చే పారిశ్రామికవేత్తలను వచ్చే నెలలో ఏపీలో జరగబోయే సీఐఐ సదస్సుకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వ్యవసాయం, ఫార్మా, సోలార్ ఎనర్జీ, ఐటీ, మౌలిక వసతులు వంటి కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోనుంది.
Chandrababu
chandrababu davos tour
world economic forum
Narendra Modi

More Telugu News