Pawan Kalyan: పవన్ కల్యాణ్ భేటీలో హిందీలో అదరగొట్టిన పోలండ్ అంబాసడర్.. బాలీవుడ్ పాట పాడి అలరించిన వైనం!

  • పవన్ తో ఆడమ్ బురాకోవస్కీ భేటీ
  • హిందీలో మాట్లాడిన ఆడమ్
  • పవన్ చాలా బ్రిలియంట్ అంటూ కితాబు
హైదరాబాదులోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో పోలండ్ రాయబారి ఆడమ్ బురాకోవస్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ దంపతులకు ఆడమ్ దంపతులు బహుమతులు ఇవ్వగా... పవన్ భార్య అన్నా వారిద్దరికీ బహుమతులను అందించారు. అనంతరం కొందరు ప్రత్యేక ఆహ్వానితులు, విదేశీ విద్యార్థులతో పవన్, ఆడమ్ లు ముచ్చటించారు. ఈ సందర్భంగా తనకు హిందీ వచ్చని చెప్పిన ఆడమ్... హిందీ మాట్లాడుతూ అదరగొట్టారు. అంతేకాదు 'ప్యార్ హువా' అంటూ పాత బాలీవుడ్ పాటపాడి మైమరపించారు. దీంతో, పవన్ సహా అక్కడున్నవారంతా చప్పట్ల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఆడమ్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ చాలా తెలివైనవారని కితాబిచ్చారు. భారతీయ సినీ రంగంలోని గొప్ప నటుల్లో పవన్ ఒకరని అన్నారు. పవన్ తో మాట్లాడిన సందర్భంగా తాను ఒక విషయాన్ని గుర్తించానని... పవన్ ఒక బ్రిలియంట్ అని, అతని మనస్సులో ఎన్నో మంచి ఐడియాలు ఉన్నాయని చెప్పారు. పోలండ్ లో సినిమా షూటింగ్ లు చేయాలని, అందుకు పవన్ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తాను తప్పకుండా సహకరిస్తానని చెప్పారు.
Pawan Kalyan
adam burakovaski
tollywood
Jana Sena

More Telugu News