Pawan Kalyan: చర్చిలో ప్రార్థనలు చేసిన పవన్ కల్యాణ్.. ఫొటోలు చూడండి

  • సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు
  • పవన్ వెంట ఆయన సతీమణి అన్నా
  • పోలాండ్ అంబాసడర్ తో భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఈ ఉదయం ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే ఆయన తన భార్య అన్నాతో కలసి చర్చికి వెళ్లారు. తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేస్తానని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆడమ్ బురాకోవస్కీతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనకు పవన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. సమావేశం సందర్భంగా వీరిరువురూ పలు విషయాలపై చర్చించారు.
.
Pawan Kalyan
adam burakovaski
Jana Sena

More Telugu News