gaddar: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. రక్షించండి: గద్దర్

  • తనపై కాల్పులు జరిగి 20 ఏళ్లు గడుస్తున్నాయి
  • విచారణ సరిగా జరగడం లేదు
  • సీబీఐ విచారణకు ఆదేశించండి
తనపై కాల్పులు జరిగి 20 ఏళ్లు గడుస్తున్నాయని... ఆ కేసుకు సంబంధించిన విచారణ ఏ మాత్రం ముందుకు సాగలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని ప్రజాగాయకుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసిన ఆయన... తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోయారు. కాల్పుల ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. విచారణకు సంబంధించి గతంలోనే తాను రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాశానని చెప్పారు. అప్పట్లో రాష్ట్రపతి సైతం విచారణకు ఆదేశిస్తూ రాసిన లేఖ ప్రతులను నాయినికి అందించారు. 
gaddar
threat to gaddar
nayini narsimha reddy

More Telugu News