amazon great indian sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్... ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లు
- రాత్రి 12 గం.లకు ప్రారంభం
- జనవరి 24 వరకు జరగనున్న సేల్
- ప్రైమ్ సభ్యులకు ఇవాళ మధ్యాహ్నం నుంచే
మంచి మంచి ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మరోసారి ముందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఇవాళ మధ్యాహ్నం 12 గం.ల నుంచి ఇతరులకు రాత్రి 12 గం.ల నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. జనవరి 24 వరకు ఈ సేల్ జరగనుంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, కిచెన్, గృహావసరాలపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రవేశపెట్టబోతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ కార్డు మీద పది శాతం అదనపు క్యాష్‌బ్యాక్, అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ప్రైమ్ సభ్యులు యాప్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ముందుగా కార్ట్‌లో యాడ్ చేసుకుని, సేల్ అధికారికంగా ప్రారంభమైన తర్వాత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వన్‌ప్లస్ 5టీ లావా, ఆనర్ వ్యూ10, ఎల్‌జీ వీ30 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై కూడా అమెజాన్ ఆఫర్లను ప్రకటించింది.
వన్‌ప్లస్, మోటోరోలా, శాంసంగ్, ఆపిల్, కూల్‌ప్యాడ్, ఎమ్ఐ, ఆనర్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై 40 శాతం వరకు, కెమెరాలు, టీవీలు, వైఫై రూటర్లు వంటి ఎలక్ట్రానిక్స్‌పై 55 శాతం వరకు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, మైక్రోవేవ్ ఓవెన్లు వంటి గృహోపకరణాలపై 50 శాతం వరకు, ఇక ఇతర గృహావసర వస్తువులపై 75 శాతం వరకు, ఫ్యాషన్ బ్రాండ్లపై 40-80 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొంది.