Asaduddin Owaisi: మోదీకి అసదుద్దీన్ ఒవైసీ థ్యాంక్స్.. ప్రధాని వల్లే ముస్లింలు ఏకమయ్యారన్న ఎంపీ!

  • ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడడం వల్ల ముస్లింలు ఏకమయ్యారు
  • ముస్లిం మహిళలపై ప్రేమ ఉంటే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి
  • ట్రిపుల్ తలాక్ చెప్పే వారిని సంఘం నుంచి బహిష్కరించాలి
ప్రధాని నరేంద్రమోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని మోదీ లేవనెత్తడం వల్లే ముస్లింలందరూ ఏకమయ్యారని పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా మోదీకి థ్యాంక్స్ చెప్పారు. శుక్రవారం కర్నూలులో పర్యటించిన ఎంపీ మాట్లాడుతూ.. ముస్లిం మహిళలపై కేంద్రానికి నిజంగా ప్రేమ ఉంటే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించి, ప్రతీ మహిళకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ముమ్మారు తలాక్ చెబితే వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఎంపీ పిలుపు నిచ్చారు.

సమస్యలేవైనా ఉంటే మత పెద్దల వద్ద పరిష్కరించుకోవాలని అసదుద్దీన్ సూచించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై స్పందిస్తూ.. ఆ సమస్య కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడబోనని పేర్కొన్నారు.
Asaduddin Owaisi
Hyderabad
MIM

More Telugu News