anchor: ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకుంటా!: యాంకర్ ప్రదీప్

  • నా లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఫైన్ విధించారు
  • ఇలాంటి పనులు చేయొద్దని మేజిస్ట్రేట్ సూచించారు
  • నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: ప్రదీప్
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్  డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్లు రద్దు చేస్తూ, రూ.2,100 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం, మీడియాతో ప్రదీప్ మాట్లాడుతూ, తన లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఫైన్ విధించిన విషయాన్ని చెప్పాడు.

డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దంటూ ప్రచారం చేస్తున్న మీరు ఇలాంటి పనులు చేయొద్దని మేజిస్ట్రేట్ తనకు సూచించినట్టు చెప్పాడు. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకుంటానని అన్నాడు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నాడు.
anchor
pradeep
Hyderabad

More Telugu News