paruchuri: ’క్లైమాక్స్’ ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాం: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
’కలియుగ మహాభారతం’, ‘ఛాయ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన హనుమాన్ ప్రసాద్ తమకు చెప్పిన విషయాలను ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ  ప్రస్తావించారు. ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ మాట్లాడుతూ, హనుమాన్ ప్రసాద్ గారు ఓ అద్భుతమైన మాట చెప్పారు.

అదేమిటంటే..‘‘సినిమా’ పంచభక్ష్య పరమాన్నం అయితే, ‘క్లైమాక్స్’ అనేది కిళ్లీ’ అని చెప్పారు. అంటే, కడుపు నిండా పంచభక్ష్య పరమాన్నం తిన్నా కూడా.. ఆ తర్వాత వేసుకునే కిళ్లీలో సున్నం ఎక్కువైతే ఏం చేస్తాం ఊసేస్తాం. అలాగే, సినిమా అంతా బాగున్నా..క్లైమాక్స్ నచ్చకపోతే భరించలేం. సినిమా క్లైమాక్స్ ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
paruchuri
Tollywood

More Telugu News