యాంకర్ ప్రదీప్ కు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!: తీర్పు వెల్లడించిన కోర్టు
- మూడేళ్ల పాటు ప్రదీప్ లైసెన్స్ రద్దు
- రూ.2,100 జరిమానా విధింపు
- తీర్పు వెలువరించిన నాంపల్లి కోర్టు
కాగా, ‘డ్రంకెన్ డ్రైవ్ కు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసిన మీరు మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా?’ అని ప్రదీప్ ను న్యాయమూర్తి ప్రశ్నించినట్టు సమాచారం. ‘ఆ రోజు డ్రైవర్ లేనందున నేనే కారు డ్రైవ్ చేశాను’ అని ప్రదీప్ సమాధానం చెప్పారట. కాగా, గత ఏడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.