Chandrababu: ‘మీ-సేవ’, ‘ఫైబర్ గ్రిడ్’ సీఈవోలపై చంద్రబాబు సీరియస్

  • వృద్ధాప్య పింఛన్ల అవకతవకలపై చంద్రబాబుకు మంత్రుల ఫిర్యాదు
  • పింఛన్ల విషయంలో తేడా జరిగితే సంహించేది లేదు
  • టెక్నాలజీ అందుబాటులో ఉన్నా అవకతవకలు ఎలా జరుగుతాయి?: చంద్రబాబు 
‘మీ-సేవ’, ‘ఫైబర్ గ్రిడ్ సీఈవోలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వృద్ధాప్య పింఛన్ల  అవకతవకలపై మంత్రులు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావులు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆయన దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ, పింఛన్ల విషయంలో తేడా జరిగితే సంహించేది లేదని, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా అవకతవకలు ఎలా జరుగుతాయంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడితే జైలు కెళ్తారని చంద్రబాబు హెచ్చరించారు.
Chandrababu
Andhra Pradesh

More Telugu News