charan: చరణ్ సినిమాలో సీనియర్ హీరోయిన్!

  • బోయపాటితో చరణ్ 
  • కీలకమైన పాత్రలో స్నేహ 
  • ఆమె పాత్ర హైలైట్ అంటూ టాక్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ చేస్తోన్న సినిమా, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టుకుంది. ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ స్నేహ కనిపించనున్నారనేది తాజా సమాచారం.

 'సన్నాఫ్ సత్యమూర్తి' తరువాత తెలుగులో ఆమె చేస్తోన్న సినిమా ఇదే. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా .. అవి తన స్థాయికి తగినవి కాకపోవడంతో ఆమె చేయలేదని తెలుస్తోంది. స్నేహ పాత్రను బోయపాటి మలచిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేదిలా ఉంటుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతోన్న సంగతి తెలిసిందే.  
charan
kiara
sneha

More Telugu News