charmi: రాత్రి పూట.. బైక్ పై.. హైదరాబాద్ లో ఛార్మి షికార్లు.. వీడియో చూడండి!

  • బైక్ పై చక్కర్లు కొట్టిన ఛార్మి
  • కోఆర్డినేటర్ శ్రీధర్ తో కలసి బైక్ రైడ్
  • స్ట్రీట్ ఫుడ్ రుచి చూసిన వైనం 
అందాల నటి ఛార్మికి సడన్ గా ఓ కోరిక కలిగింది. రాత్రి పూట హైదరాబాద్ రోడ్లపై బైక్ మీద షికార్లు చేయాలని అనిపించింది. దీంతో, షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఆమె... తనను ఎవరూ గుర్తు పట్టకుండా, ముఖాన్ని కవర్ చేసుకుని బైక్ రైడ్ చేసింది.

పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న 'మెహబూబా' సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఛార్మి వ్యవహరిస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత రాత్రి సమయంలో బైక్ రైడ్ కు బయల్దేరింది. తన కోఆర్డినేటర్ శ్రీధర్ తో కలసి చక్కర్లు కొట్టింది. మార్గమధ్యంలో స్ట్రీట్ ఫుడ్ కోసం వీరిద్దరూ రోడ్డు పక్కనున్న ఓ బండి వద్ద ఆగారు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది ఛార్మి. 'హైదరాబాద్ వీధుల్లో బైక్ రైడ్' అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అప్ లోడ్ చేసింది.
charmi
charmi byke ride
tollywood

More Telugu News