Anchor Pradeep: ఎట్టకేలకు కోర్టుకు హాజరైన యాంకర్ ప్రదీప్, మరికాసేపట్లో శిక్ష ఖరారు!

  • డిసెంబర్ 31న దొరికిపోయిన ప్రదీప్
  • 8న కౌన్సెలింగ్ కు హాజరైన యాంకర్
  • మరికాసేపట్లో శిక్ష
డిసెంబర్ 31వ తేదీ తప్పతాగి పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ నేడు నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యాడు. పరిమితికి మించి మద్యం తాగిన కేసుతో పాటు, కారుకు బ్లాక్ ఫిల్మ్ తొలగించని కేసు అతనిపై నమోదైన సంగతి తెలిసిందే.

 డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన తరువాత, ఈ నెల 7వ తేదీ వరకూ కౌన్సెలింగ్ కు రాకుండా, పోలీసుల ఆగ్రహానికి గురైన ప్రదీప్, ఆ తరువాత కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. ఆపై షూటింగ్ ఉందని చెబుతూ కోర్టుకు రాలేదు. 22వ తేదీన కోర్టుకు హాజరవుతానని చెప్పిన ప్రదీప్, నేడు కోర్టుకు వచ్చాడు. ఇక అతనికి కోర్టు ఏ శిక్ష విధిస్తుందన్న విషయం మరికాసేపట్లో తేలనుంది. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన వేళ అతని రక్తంలో 178 పాయింట్ల ఆల్కహాల్ ఉన్నట్టు తేలింది.
Anchor Pradeep
Nampally Court
Police
Hyderabad

More Telugu News