మరో నెల తరువాత భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు!
- బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై సుంకాలు
- పీసీబీలు, కెమెరాలు, డిస్ ప్లేల ధరలు పెరిగే అవకాశం
- తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకేనంటున్న కేంద్రం
కాగా, పలు భారత కంపెనీలు విదేశాల నుంచి విడిభాగాలు తెచ్చి, ఇక్కడ వాటిని క్రమ పద్ధతిలో అమర్చి సెల్ ఫోన్లు వంటి ప్రొడక్టులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. సుంకాలు లేకుండా వీటి దిగుమతికి అనుమతిస్తున్న కారణంగా, తయారీ రంగం వృద్ధిని సాధించడంలో విఫలమవుతోందన్నది కేంద్రం అభిప్రాయం. ఇండియాను తయారీ హబ్ గా మార్చాలంటే, కస్టమ్స్ సుంకాలను పెంచాలని భావిస్తోంది. కాగా, గత జూలైలో మొబైల్ ఫోన్ల దిగుమతిపై 10 శాతం సుంకాలు విధించిన కేంద్రం, డిసెంబర్ లో దీనిని 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.