Pawan Kalyan: పది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను: కత్తి మహేశ్

  • పవన్ ఫ్యాన్స్ చేసిన ఫోన్ కాల్స్, పోస్ట్ చేసిన వీడియోలే ఆధారం  
  • ‘శతఘ్ని’లో పవన్ మాట్లాడిన వీడియోను పోలీసులకు అందజేస్తా
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా నా పోరాటాన్ని కొనసాగిస్తా: కత్తి
పవన్ కల్యాణ్ అభిమానులకు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ కు మధ్య వివాదం సుమారు నాలుగు నెలలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తనను అసభ్య కామెంట్లతో వేధింపుల పాలు చేస్తూ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్నారని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేయాలని కత్తి మహేశ్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘టీవీ 9’లో సుదీర్ఘంగా నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో కత్తి మహేశ్, ఆయనపై ఆరోపణలు చేసిన నిర్మాత రాంకీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్తి మహేశ్ మాట్లాడుతూ, తాను గుర్తించిన పది మంది వ్యక్తులపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. వాళ్లకు వాళ్లు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ పలు ఛానెల్స్ ద్వారా తనకు చేసిన ఫోన్ కాల్స్, పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా ఈ ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

జనసేన పార్టీకి చెందిన ‘శతఘ్ని’ టీవీలో పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడాడో, ఆ వీడియోను కూడా ఫిర్యాదు చేసేటప్పుడు పోలీసులకు ఇస్తానని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా తాను చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు.  
Pawan Kalyan
Kathi Mahesh

More Telugu News