rashi khanna: రాశి ఖన్నాకి మరో హిట్ పడేనా?

  • రవితేజ సరసన 'టచ్ చేసి చూడు'
  • వరుణ్ తేజ్ జోడీగా 'తొలిప్రేమ'
  • వచ్చే నెలలో రెండు సినిమాలు
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. యూత్ హృదయాలు కొల్లగొట్టేసిన రాశి ఖన్నా అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో అంతగా దూకుడు చూపించలేదు .. అలాగని తొందరపడనూ లేదు. తనకి నచ్చిన అవకాశాలలో మంచివాటిని ఎంచుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది.

ఈ నేపథ్యంలో 'జై లవ కుశ' సినిమాతో పెద్ద హిట్ ను అందుకున్న ఆమె, తాజాగా రవితేజ .. వరుణ్ తేజ్ లతో సినిమాలు చేసింది. రవితేజ సరసన ఆమె చేసిన 'టచ్ చేసి చూడు' వచ్చేనెల 2వ తేదీన విడుదల కానుంది. ఇక వరుణ్ తేజ్ తో చేసిన 'తొలిప్రేమ' వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా చాలా తక్కువ గ్యాప్ లో రాశి ఖన్నా సినిమాలు రెండు రానున్నాయి. ఈ రెండింటిలో ఒక్క సినిమా హిట్ కొట్టినా రాశి ఖన్నా కెరియర్ మరింత స్పీడ్ అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
rashi khanna

More Telugu News