టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై సీనియర్ నేత పెద్దిరెడ్డి స్పందన
- మోత్కుపల్లి ఎమోషన్తో మాట్లాడినట్లున్నారు
- ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీ ఎలా విలీనం అవుతుంది?
- విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని టీఆర్ఎస్కు ఇవ్వాలా?
తాజాగా టీటీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మోత్కుపల్లి ఎమోషన్తో మాట్లాడినట్లున్నారని అన్నారు. జాతీయ పార్టీ అయిన తమ తెలుగు దేశం పార్టీ.. ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం అవుతుందని వ్యాఖ్యానించారు. విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని టీఆర్ఎస్కు ఇవ్వాలా? అని ఎద్దేవా చేశారు. మోత్కుపల్లి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల టీడీపీ నేతలు నిరుత్సాహానికి గురవుతారని అన్నారు.