దుబాయ్, షార్జాలకు విజయవాడ నుంచి తొలి ఇంటర్నేషనల్ విమాన సర్వీస్.. రేపే ప్రారంభం!
- తీరనున్న అమరావతి వాసుల మరో కల
- దుబాయ్, షార్జాలకు వెళ్లనున్న విమానం
- ఎయిర్ ఇండియా సేవలు అందుబాటులోకి
- ప్రారంభించనున్న అశోక గజపతిరాజు
దుబాయ్, షార్జాలకు ఈ విమానం నడుస్తుంది. విజయవాడలో ఇప్పటికే ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ విమానం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బయలుదేరి 9.45కు విజయవాడకు వచ్చి, ఆపై ఉదయం 10.30కి బయలుదేరి ముంబై మీదుగా దుబాయ్, షార్జాలకు వెళుతుంది. ముంబైకి అక్కడి నుంచి యూఏఈకి వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ విమానానికి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు విమాన సంస్థలు ఇంటర్నేషనల్ సర్వీసులను విజయవాడ నుంచి ప్రారంభించేందుకు సాహసం చేయలేకపోతున్న వేళ, ఎయిర్ ఇండియా ముందుకు రావడం గమనార్హం.