Virat Kohli: మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక... అంతెత్తున లేచిన కోహ్లీ!

  • విలేకరుల ప్రశ్నలపై కోహ్లీ అసహనం
  • అత్యుత్తమ జట్టు ఏదో చెప్పాలని ప్రశ్న
  • ఒక్క మ్యాచ్ విఫలమైతే పనికిరానట్టేనా?
  • చిర్రుబుర్రులాడిన విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఓటమి తరువాత మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్న వేళ, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎదురు ప్రశ్నలు వేస్తూ, అంతెత్తున లేచాడు. రెండో టెస్టులో ధావన్, భువనేశ్వర్ లను పక్కన బెట్టిన విషయాన్ని ప్రస్తావించిన మీడియా, అత్యుత్తమ జట్టునే మీరు బరిలోకి దించారా? అని ప్రశ్నించగా కోహ్లీ ఘాటుగా స్పందించాడు.

తాము విజయం సాధించి ఉంటే ఇదే అత్యుత్తమ జట్టని వ్యాఖ్యానిస్తారా? అంటూ మండిపడ్డాడు. అత్యుత్తమ 11 మంది ఎవరో మీడియానే చెబితే వారితోనే ఆడిస్తానని అన్నాడు. ఒక్క మ్యాచ్ లో విఫలమైతే ఆడటానికి పనికిరావని ఒకరిని పక్కన పెట్టలేమని, మెరుగ్గా కనిపించిన జట్టు కూడా ఓడిపోవచ్చని అన్నాడు. ఫలితం అనుకూలంగా లేనప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయని, వాటికి తాము అలవాటు పడ్డామని అన్నాడు.
Virat Kohli
India
South Africk
Cricket

More Telugu News