Harish Rao: హరీశ్ రావుకు లెటర్ రాసిన దేవినేని ఉమ!

  • ఆర్డీఎస్ కు సహకరించాలని కోరిన హరీశ్ రావు
  • వెంటనే స్పందించిన దేవినేని ఉమ
  • ఇది సాంకేతికాంశాలతో ముడిపడిన అంశం
  • ముందు అధికారుల స్థాయి సమావేశం
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రాజెక్టు ముందడుగు వేసేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు, తెలంగాణకు చెందిన అదే శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాయగా, దేవినేని స్పందించారు. ఆర్డీఎస్ గురించి పలు అంశాలను తన లేఖలో ప్రస్తావించిన ఆయన, ఇది ఎన్నో సాంకేతికాంశాలతో ముడిపడిన ముఖ్యమైన ప్రాజెక్టని గుర్తు చేశారు. మంత్రుల స్థాయి సమావేశానికి కూర్చునే ముందు ఆర్డీఎస్ పై మరింత లోతుగా చర్చించాల్సి వుందని దేవినేని అభిప్రాయపడ్డారు. ముందు ఇంజనీర్లు తదితర అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
Harish Rao
Devineni Uma
RDS

More Telugu News