Andhra Pradesh: కళాకారులను సత్కరించే సంస్కారం ఉన్న వ్యక్తి సుబ్బరామిరెడ్డి!: మోహన్ బాబు
- గొప్ప వ్యక్తి, అజాతశత్రువు సుబ్బరామిరెడ్డి
- ఆయనకు శివ కటాక్షం మరింత ఉండాలి
- ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించిన ఆయనకు ధన్యవాదాలు: మోహన్ బాబు
గొప్ప వ్యక్తి, అజాతశత్రువు టి. సుబ్బరామిరెడ్డి అని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ప్రశంసించారు. ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కారం పొందిన అనంతరం, మోహన్ బాబు మాట్లాడుతూ, కళాకారులను సత్కరించే సంస్కారం ఉన్న టి.సుబ్బరామిరెడ్డికి శివ కటాక్షం మరింత ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ అవార్డుతో తనను సత్కరించిన సుబ్బరామిరెడ్డికి తన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా తన సినీ కెరీర్ లో పడ్డ కష్టనష్టాలు, బాధాకరమైన, సంతోషకరమైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తనకు అత్యంత ఆత్మీయులు, మంచి మనసున్న వ్యక్తి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అని, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు.