cinema: వారసత్వం చిత్ర పరిశ్రమ మనుగడకే ప్రమాదం: సినీ నటుడు చంద్రమోహన్

  • కొత్తగా వచ్చిన వారిని ఎదగనివ్వడం లేదు
  • ప్రస్తుతం వచ్చే చిత్రాల కథ, కథనాలు ఏమీ బాగుండటం లేదు
  • పరభాషా నటులనే ఎంపిక చేయడం బాధ కలిగిస్తోంది
  • ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్
తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వం కొనసాగుతోందని, ఇది చిత్రపరిశ్రమ మనుగడకే ప్రమాదకరమని సీనియర్ సినీ నటుడు చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. నర్సీపట్నంలో ఇటీవల జరిగిన మకర సంక్రాంతి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో చంద్రమోహన్ మాట్లాడుతూ, సినీ రంగంలో వారసత్వం మాత్రమే కొనసాగుతోందని, కొత్తగా వచ్చిన వారిని ఎదగనివ్వడం లేదని విమర్శించారు.

ప్రస్తుతం వచ్చే చిత్రాలలో కథ, కథనాలు ఏమీ బాగుండటం లేదని, వర్థమాన సినీ నటులు ఎందరో వస్తున్నారని, టాలెంట్ ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. చిత్ర పరిశ్రమలో ప్రతి నాయకుని పాత్రలకు మేధావులైన నటులు వున్నప్పటికీ పరభాషా నటులనే ఎంపిక చేయడం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు.
cinema
artist
chandramohan

More Telugu News