TTelugudesam: ఏపీ సరే తెలంగాణ మాటేమిటి?: చంద్రబాబుతో ఎల్ రమణ

  • అమరావతికి వచ్చిన టీటీడీపీ అధ్యక్షుడు
  • చంద్రబాబు నివాసంలో సమావేశం
  • తెలంగాణ రాజకీయాలపై చర్చలు
  • రాష్ట్రంలో పర్యటించాలని కోరిన ఎల్ రమణ
  • సానుకూలంగా స్పందించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తున్నట్టుగానే, తెలంగాణకూ కొంత సమయాన్ని కేటాయించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ ఉదయం చంద్రబాబునాయుడిని కోరారు. బుధవారం నాడు అమరావతికి వచ్చిన ఆయన, సీఎం నివాసానికి వెళ్లి సుమారు అరగంట పాటు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను గురించి వివరించిన ఆయన, రాష్ట్రంలో పర్యటించి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలని కోరారు.

గురువారం నుంచి తెలంగాణలో టీడీపీ ఆధ్వర్యంలో జరగనున్న 'పల్లెపల్లెకు టీడీపీ' కార్యక్రమంలో వీలు చూసుకుని పాల్గొనాలని అడిగారు. దీనికి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆపై ఎన్టీఆర్ వర్ధంతికి ఏర్పాట్లు, రక్తదాన శిబిరాల నిర్వహణపైనా చంద్రబాబు, రమణ మధ్య చర్చలు సాగాయి. 'పల్లెపల్లెకు టీడీపీ'ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా రమణకు చంద్రబాబు సూచించారు.
TTelugudesam
L Ramana
Chandrababu
Amaravati

More Telugu News