ntr: రాజమౌళి మూవీ బడ్జెట్ 90 కోట్లు .. రెమ్యునరేషన్స్ కాకుండానే సుమా!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కథ ఓకే చేసిన రాజమౌళి, స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ఒక రఫ్ ఎస్టిమేట్ లిస్ట్ ను నిర్మాతలకు ఇచ్చాడట. ఆ లిస్ట్ ప్రకారం .. 90 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ఆయన స్పష్టం చేసినట్టుగా సమాచారం.

 అయితే ఇందులో రాజమౌళి .. ఎన్టీఆర్ ... చరణ్ ల పారితోషికాలు లేవు. మిగతా ఖర్చులన్నీ కలుపుకుని ఈ మొత్తం అవుతాయని రాజమౌళి చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ కూడా ఉండవట .. యాక్షన్ సీన్సే ఒక రేంజ్ లో ఉంటాయట. అందువలన ఈ స్థాయి బడ్జెట్ అవుతుందని అంటున్నారు. 2018 దసరాకి తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    
Go Back to Shorts
ntr
charan

More Telugu News