nagashourya: అందమైన ప్రేమకథగా 'ఛలో' .. ట్రైలర్ రిలీజ్ రేపే

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై లవర్ బాయ్స్ గా రాణిస్తోన్న హీరోల్లో నాగశౌర్య ఒకరుగా కనిపిస్తాడు. తొలిసారిగా ఆయన తన సొంత బ్యానర్లో 'ఛలో' సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి, వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.

రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి రేపు ట్రైలర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, తాజాగా ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా టీమ్ హ్యాపీగా వుంది. ట్రైలర్ తో మరింతగా అంచనాలను పెంచగలం అనే నమ్మకంతో వున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సొంత బ్యానర్లో నాగశౌర్య హిట్ కొడతాడేమో చూడాలి మరి.   
Go Back to Shorts
nagashourya
rashmika

More Telugu News