actor sidhu: గోవా బీచ్ లో శవమై తేలిన మలయాళ నటుడు సిద్ధు!

  • యువ నటుడు సిద్ధు దుర్మరణం
  • గోవా బీచ్ లో మృతి
  • షాక్ కు గురైన సినీ పరిశ్రమ
మలయాళ నటుడు సిద్ధు గోవాలో శవమై కనిపించడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. గోవా బీచ్ వద్ద నీటిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి మరణించి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. నిన్న సాయంత్రం సిద్ధు మృతదేహాన్ని ఆయన తల్లి గుర్తించారు. పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

జనవరి 12వ తేదీన సిద్ధు తన ఇంటి నుంచి గోవాకు బయల్దేరి వచ్చాడు. 'సెకండ్ షో' సినిమా ద్వారా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. సిద్ధు మృతి పట్ల పలువురు నటులు, సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 'సెకండ్ షో సినిమా షూటింగ్ లో సిద్ధు చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలుపుతున్నా' అంటూ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశాడు. 
actor sidhu
actor sudhu died

More Telugu News