sai pallavi: అలాంటి సన్నివేశాల్లో నేను నటించలేను: సాయి పల్లవి

  • స్కిన్ షో చేయను
  • అధర చుంబనాలకు దూరం
  • హీరో కూడా ఓ యాక్టర్ మాత్రమే
గ్లామర్ పేరుతో అందాల ఆరబోతకు తాను వ్యతిరేకమని 'ఫిదా' భామ సాయి పల్లవి తెలిపింది. స్కిన్ షోను కొందరు గ్లామర్ అనుకుంటారని... అదే భావనతో తన వద్దకు కొందరు వచ్చారని... వారితో సినిమాలను తాను తిరస్కరించానని ఆమె తెలిపింది. తన ముఖం మీద మొటిమలు ఉన్నప్పటికీ... స్క్రీన్ మీద అందంగానే కనిపిస్తున్నాను కదా? అంటూ ప్రశ్నించింది.

తాను ఎక్కువ కండిషన్లు పెడుతున్నానని ఎవరైనా అనుకుంటే... తాను ఏమీ చేయలేనని చెప్పింది. తన దగ్గరకు వచ్చే కొంత మంది కథ గురించి ఏమీ చెప్పరని... ఫలానా హీరో పక్కన నటిస్తారా? అంటూ నేరుగా అడుగుతారని తెలిపింది. తన దృష్టిలో కథనే హీరో అని, మిగిలినవారంతా కేవలం యాక్టర్స్ మాత్రమేనని చెప్పింది. లిప్ లాక్స్ లాంటివి తనవల్ల కాదని... అలాంటి వాటికి తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరని తెలిపింది. 
sai pallavi
sai pallavi conditions
tollywood

More Telugu News