Manchu Vishnu: పాట సినిమాలోదే... కానీ నీ కోసమే..!: భార్యకు ప్రేమతో అంకితం చేసిన మంచు విష్ణు

  • 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రంలోని పాట టీజర్ విడుదల
  • పాటను పోస్టు చేస్తూ భార్యకు అంకితమిచ్చిన విష్ణు
  • 26న విడుదల కానున్న చిత్రం
తాను హీరోగా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రంలోని ఓ పాటను చిత్ర టీమ్ విడుదల చేయగా, ఆ పాటను తన భార్య వెరోనికాకు పుట్టిన రోజు బహుమతిగా అందిస్తున్నట్టు మంచు విష్ణు వెల్లడించాడు. "చెలియా.. చెలియా.. అరెరే నేననుకున్నానా.. కలనైనా కలగన్నానా" అంటూ సాగే పాటను ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన ఆయన, దీన్ని వెరోనికాకు ప్రేమగా అందిస్తున్నట్టు తెలిపాడు.

"నన్ను అమితంగా ప్రేమించే, అందమైన మహిళకు ఈ పాట అంకితం. ఈ పాటలోని ప్రతి పదం నిన్ను ఉద్దేశించినదే. ఇందులోని ప్రతి పదం నీపై నాకున్న ప్రేమను తెలుపుతుంది. హ్యాపీ బర్త్‌ డే మై లవ్‌" అని మెసేజ్ పెట్టాడు. తన కిష్టమైన పాటల్లో ఇది ఒకటని, సోదరుడికి శుభాకాంక్షలని మంచు మనోజ్ స్పందించాడు. ఈ చిత్రం ఈ 26న విడుదల కానుంది.
Manchu Vishnu
Achari Amerika Yatra
Song Teaser

More Telugu News