Rape: హర్యానాలో అత్యాచారాల పర్వం.. 24 గంటల్లో నాలుగు కేసులు!

  • హర్యానాలో ఘోరం
  • ఒక్క రోజులో నాలుగు ఘటనలు
  • రెండు కేసుల్లో నిందితుల అరెస్ట్
హర్యానాలో గత 24 గంటల్లో జరిగిన నాలుగు అత్యాచారాలు కలకలం రేపాయి. ఇండియాలోనే క్రైమ్ రేటులో టాప్-3లో ఉన్న హర్యానాలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం అవుతోందని, బీజేపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం అయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

50 ఏళ్ల వ్యక్తి తన సమీప బంధువైన 10 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, ఆమె రహస్య అవయవాలపై కర్రతో దాడి చేసిన ఘటన కలకలం రేపగా, ఇదే సమయంలో ఇద్దరు దళిత బాలికలను అత్యాచారం చేసి హత్య చేశారన్న వార్త వచ్చింది. మరో ఘటనలో యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనల తరువాత ముఖ్యమంత్రి ఖట్టర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మిగతా కేసుల్లో నిందితుల ఆచూకీ తెలియాల్సి వుంది.
Rape
Haryana
Khatar
Congress

More Telugu News