kabul: కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై రాకెట్ దాడి!

  • ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో దాడి
  • దెబ్బతిన్న కార్యాలయ గోడలు
  • ఉద్యోగులు క్షేమం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉన్న ఇండియన్ ఎంబసీని రాకెట్ ఢీకొనడం కలకలం రేపింది. ఈ దాడిలో రాయబార కార్యాలయం పై గోడలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఉద్యోగులంతా క్షేమంగానే బయటపడినప్పటికీ... వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక ఇతర కారణాల వల్ల జరిగిందా? అనేది చెప్పలేమని విదేశాంగ అధికారులు తెలిపారు. భవనాన్ని రాకెట్ ఢీకొన్న ఫొటోను భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 
kabul
indian embassy kabul

More Telugu News