padmavat: 'యూపీలో ‘పద్మావత్‌’ విడుదల అవుతుందా?' అని అడిగిన మీడియా.. అసహనం వ్యక్తం చేసిన యోగి ఆదిత్యనాథ్

షార్ట్స్‌లో చూడండి
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలీవుడ్ సినిమా ‘పద్మావత్‌’ ఈ నెల  25న విడుదల కానున్న విష‌యం తెలిసిందే. అయితే, రాజ‌స్థాన్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్రం ఈ సినిమా త‌మ త‌మ‌ రాష్ట్రాల్లో విడుదలయ్యే అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక‌ యోగి ఆదిత్య‌నాథ్ సీఎంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ సినిమా విడుద‌ల అవుతుందా? అనే సందేహం అందరిలోనూ ఉంది. ఈ విషయంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు యోగి ఆదిత్యనాథ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

త‌మ రాష్ట్రంలో ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అని చెప్పడానికి తానేం జ్యోతిష్యుడిని కానని యోగి ఆదిత్యనాథ్ స‌మాధానం ఇచ్చారు. కాగా, త‌న సినిమా విడుద‌ల విష‌య‌మై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ద‌ర్శ‌కుడు భన్సాలీ చర్చించనున్నారు.
Go Back to Shorts
padmavat
cinema
Uttar Pradesh
yogi adithyanath

More Telugu News