Hyderabad: హైదరాబాద్‌లోని పాతబస్తీలో పెద్ద ఎత్తున 'మోదీ పతంగులు'

  • సంక్రాంతి పండుగ సందర్భంగా పంచి పెట్టిన బీజేపీ నేతలు
  • సంక్రాంతి ప్రత్యేక ఆకర్షణగా 'మోదీ పతంగులు'
  • సంక్రాంతి పండుగ హిందూ,ముస్లింల ఐక్యతను చాటుతుందని వ్యాఖ్య
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలతో తయారుచేసిన గాలి పటాలు పెద్ద ఎత్తున కనబడ్డాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొందరు మోదీ పతంగులను స్థానికులకు పంచిపెట్టారు. వారిలో ముస్లింలే అధికంగా ఉన్నారు. బీజేపీ తెలంగాణ మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షుడు అబ్బాసితో కలిసి ఫిరసత్‌ అలీ అనే నాయకుడు ఈ గాలిపటాలను చార్మినార్ వద్ద పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ హిందూ,ముస్లింల ఐక్యతను చాటుతుందని వ్యాఖ్యానించారు. పాత బస్తీ ప్రజల సంక్షేమంపై బీజేపీ దృష్టి పెట్టిందని చెప్పారు. 
Hyderabad
kites
Narendra Modi

More Telugu News