Cricket: సెంచూరియన్‌ టెస్టు: శతకంతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ

  • టెస్టుల్లో 21వ శతకం నమోదు చేసిన కోహ్లీ
  • టీమిండియా స్కోరు 209/6(67 ఓవర్లకి)
  • క్రీజులో కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్
సెంచూరియన్‌లో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తోన్న టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అదరగొడుతున్నాడు. టెస్టుల్లో 21వ శతకం నమోదు చేసుకున్నాడు. భారత బ్యాట్స్ మెన్‌లో మురళీ విజయ్ 46, లోకేశ్ రాహుల్ 10, చటేశ్వర పుజారా 0 (రనౌట్), రోహిత్ శర్మ 10, పార్థివ్ పటేల్ 19, హార్థిక్ పాండ్యా (రనౌట్) 15 చేయగా విరాట్ కోహ్లీ 103, రవిచంద్రన్ అశ్విన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 209/6(67 ఓవర్లకి)గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, మార్కెల్, రబాడా, గిడి లకు తలో వికెట్ దక్కాయి. కాగా, దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 335 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 
Cricket
India
south africa

More Telugu News