mahesh babu: మహేష్ బాబు ఇంతకు ముందుకన్నా ఇప్పుడు బెటర్: గల్లా జయదేవ్

  • చాలా విషయాల గురించి తెలుసుకుంటున్నారు
  • మహేష్, నేను చాలా క్లోజ్
  • రాజకీయాల గురించి మహేష్ కు చెబుతుంటా
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇంతకు ముందుకన్నా ఇప్పుడు బెటర్ అని ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గతంలో మహేష్ రిజర్వుడుగా ఉండేవారని, ఇప్పుడు అనేక విషయాలను తెలసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. తాను అమెరికాకు వెళ్లేటప్పటికి మహేష్ వయసు 16 ఏళ్లని చెప్పాడు. అప్పటి నుంచి కూడా మహేష్ తో తనకు మంచి క్లోజ్ నెస్ ఉందని.. అయితే, ఏజ్ డిఫరెన్స్ ఉండటంతో తాను ప్రొటెక్టివ్ గా ఉంటానని తెలిపారు.

ఆయనకు మంచి, చెడులను చెబుతుంటానని... రాజకీయాల్లో ఏం జరుగుతుందో మహేష్ కు చెప్పే ఏకైక వ్యక్తిని తానే అనుకుంటానని చెప్పారు. 2014 ఎన్నికల ప్రచారానికి మహేష్ రాకపోవడమే మంచిదయిందని... వచ్చుంటే, మహేష్ వల్లే తాను గెలిచాననే ప్రచారం జరిగి ఉండేదని అన్నారు. సొంత సామర్థ్యంతో గెలిచాననే సంతృప్తి తనకుందని చెప్పారు. 
mahesh babu
galla jayadev

More Telugu News