nayanatara: దర్శక, నిర్మాతలకు నయనతార కొత్త కండిషన్లు!

  • కురచ దుస్తులకు నో
  • హీరోలతో సన్నిహిత సీన్లలో నటించను
  • ప్రమోషన్లకు రాను
దక్షిణాదిలో అగ్ర నటిగా కొనసాగుతున్న నయనతార గతంలో చాలా గ్లామరస్ గా కనిపించేది. బోల్డ్ సీన్లు, బికినీ సీన్లలో కూడా నటించి కుర్రకారును హుషారెత్తించింది నయన్. అయితే, ఇప్పుడు వాటన్నింటికీ నో చెబుతోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఆమె ప్రేమలో ఉంది. దీంతో, కొత్త సినిమాల విషయంలో చాలా కండిషన్లు పెడుతోంది.

కురచ దుస్తులు ధరించనని, హీరోలతో సన్నిహితంగా ఉండే సీన్లలో నటించనని ఆమె చెబుతోంది. అంతేకాదు, ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరు కాబోనని స్పష్టం చేసింది. ఈ కండిషన్లతోనే బాలయ్య 'జై సింహా' సినిమాలో కూడా నటించిందట. సినిమాలో బాలయ్యకు దూరంగా ఉంటూనే సినిమాను పూర్తి చేసింది. అయితే, ఇన్ని కండిషన్లు పెడుతున్నప్పటికీ, నయన్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. 
nayanatara
bollywood
kollywood
nayanatara conditions

More Telugu News