యూపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కు దావూద్ గ్యాంగ్ వార్నింగ్!
- వసీం రిజ్వీకి హెచ్చరిక
- మొత్తం కుటుంబాన్ని హతమారుస్తామంటూ వార్నింగ్
- పోలీసులకు ఫిర్యాదు
ఈ నేపథ్యంలోనే దావూద్ అనుచరుడు ఈ హెచ్చరికలు జారీ చేశాడు. అయోధ్యలోని రామాలయానికి వసీం రిజ్వీ అనుకూలంగా గతంలో వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు టెర్రరిస్టుల తయారీ కేంద్రాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, తనతో పాటు తన కుటుంబాన్ని హతమారుస్తానంటూ ఫోన్ ద్వారా హెచ్చరికలు వచ్చాయని లక్నో పోలీసులకు వసీం రిజ్వీ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.