Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ‘అజ్ఞాతవాసి’ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయనున్న పవర్ స్టార్?

  • బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన పవన్ 25వ చిత్రం
  • కలెక్షన్ల  సునామీ అనుకుంటే.. నష్టాలు మిగిల్చిన ‘అజ్ఞాతవాసి’
  • తీసుకున్న రూ.15 కోట్లను ఇచ్చేందుకు సిద్ధమైన పవర్ స్టార్
భారీ అంచనాల మధ్య విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’  బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్ భోగట్టా.  వసూళ్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడంతో సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

పవన్ 25వ సినిమాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు రేకెత్తించింది. కలెక్షన్ల సునామీ ఖాయమని అందరూ భావించారు. అద్భుతాన్ని ఆశించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆ నష్టాన్ని కొంతమేర అయినా తగ్గించాలన్న ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘అజ్ఞాతవాసి’ కోసం తీసుకున్న రూ.15 కోట్లను తిరిగి ఇచ్చేయనున్నట్టు టాలీవుడ్‌ టాక్. విషయం తెలిసిన పవన్ అభిమానులు ఆయన ఉదార స్వభావానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని అంటున్నారు.  
Pawan Kalyan
Agnathavasi
Tollywood

More Telugu News