TTD: తిరుమలలో చంద్రబాబు కీలక ప్రకటన!

  • అతి త్వరలో టీటీడీకి కొత్త పాలక మండలి
  • హిందూ ధర్మం ప్రకారమే నిర్ణయం
  • టీటీడీ పవిత్రతను కాపాడుతానన్న చంద్రబాబు
ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. అతి త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని మార్చనున్నట్టు కీలక ప్రకటన చేశారు.

ఇతర మతాలపై విశ్వాసం ఉన్నవారిని నియమిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన ఆయన, హిందూ ధర్మం ప్రకారమే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని తెలిపారు. టీటీడీ పవిత్రతను కాపాడుతానని వెల్లడించిన చంద్రబాబు, ఈ సంక్రాంతి ప్రజలందరికీ సిరి సంపదలను ఇవ్వాలని వెంకన్న ఎదుట ప్రార్థించినట్టు వెల్లడించారు. ఆయన వెంట హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి లోకేష్ తదితరులు ఉన్నారు.
TTD
Tirumala
Chandrababu
Balakrishna
Nara Lokesh

More Telugu News